హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరంలో రేపు ఉచిత కంటి శిబిరం

KDP: మైలవరం ZPHSలో ఈనెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి, అర్హులకు ఉచిత ఐఓఎల్ ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. లెన్స్, మందులు, భోజనం, వసతి, కళ్లద్దాలు ఉచితంగా అందిస్తామన్నారు.