AKP: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని 10 గిరిజన గ్రామాలకు జెడ్.జోగంపేటను గ్యాస్ పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. మంగళవారం జెడ్.జోగంపేటలో గ్యాస్ బండలు పట్టుకుని ధర్నా చేశారు. గ్యాస్ కోసం 12 కిలోమీటర్ల దూరంలోని చీమలపాడుకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గ్యాస్ పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేయాలి'


