హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్య కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు

W.G: ఈనెల 15న ఆకివీడు శివారు ఉప్పుటేరు ప్రాంతంలో మహిళ హత్యకు గురైన కేసును పోలీసులు ఛేదించారు. భర్తే హత్య చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఆకివీడు CI కాళీ చరణ్, SI శుభ శేఖర్, కాళ్ల SI గణేశ్, సిబ్బందికి అడిషనల్ SP రివార్డులు అందజేశారు. కేసును పరిష్కరించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.