తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో రద్దీ ఉండే బస్టాండ్ అవరణంలో డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు ప్రక్కన్న గుంతలు సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో వాహన దారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వృద్ధులు, చిన్నారులు గుంతల్లో పడే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి గుంతలు చుట్టూ రక్షణ చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బస్టాండ్ అవరణంలో ప్రమాదకరంగా గుంతలు


