TPT: జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ ఖోఖో U-17 పోటీలను శాప్ ఛైర్మన్ రవి నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనే విజయనగరం, బాపట్ల జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని యువతీ యువకుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఖోఖో బాయ్స్ పోటీలు ప్రారంభించిన శాప్ ఛైర్మన్


