హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణచెరువులో వైద్య శిబిరం

W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో మంగళవారం 104 సంచార వైద్య వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారిణి భారతి ఆధ్వర్యంలో మొత్తం 48 మంది రోగులకు ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. ప్రభుత్వ వైద్య సేవలను గ్రామీణ ప్రజలందరూ విధిగా సద్వినియోగం చేసుకోవాలని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు.