హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వానంగా మారిన కోసూరువారిపాలెం రోడ్డు

కృష్ణా: మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆంజనేయస్వామి ఆలయం నుంచి జిల్లా పరిషత్ మురుగు డ్రైన్ రోడ్డు వరకు రహదారి దెబ్బతిందని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని స్పందనలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.