హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన హక్కుల పోరాటాలపై రౌడీషీట్లా'

ELR: ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం ప్రకారం గిరిజన భూముల రక్షణ కోసం చట్టబద్ధంగా పోరాడుతున్న సీపీఎం నాయకులపై పెట్టిన రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రం అందజేశారు.