హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎద్దుల బండిని ఢీకొట్టిన బస్సు..!

KDP: ఖాజీపేట మండలం భూమాయపల్లె వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కడపకు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపైకి వస్తున్న ఎద్దుల బండిని ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎద్దుకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.