హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణిగుంటలో ఉదయాన్నే జోరుగా మద్యం విక్రయాలు!

TPT: రేణిగుంట పట్టణ పరిధిలోని టపాసుల గోదాం ప్రక్కన ఉన్న వైన్స్ షాపు, పెట్రోల్ బంక్ పక్కన ఉన్న వైన్స్ షాపుల్లో ఉదయాన్నే మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. నిర్ణీత సమయం తర్వాత మద్యం విక్రయాలు ప్రారంభించాల్సి ఉండగా, ముందుగానే షాపులు తెరిచి విక్రయాలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు దృష్టి సారించి తనిఖీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.