హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ

NTR: స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ZPTC, మండల పరిషత్తుల ఛైర్‌పర్సన్‌ పదవులు కీలకం కానున్నాయి. కాగా, మేయర్ పీఠంపై పార్టీలు దృష్టి సారించాయి. రాజధాని అమరావతికి పరిసర నగరమైన విజయవాడ మేయర్ పీఠంపై టీడీపీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్‌ను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి.