కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రు శివారు దేవర్లంక టిడ్కో గృహ సముదాయాలకు పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సు నడపాలని ఆ ప్రాంత వాసులు అధికారులను కోరారు. అమలాపురం నుంచి ఆదుర్రు వెళ్లే బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 8:30కు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సు నడపాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
టిడ్కో ఇళ్లకు ప్రత్యేక బస్సు నడపాలని వినతి


