హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం

AKP: చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసాద్ మృతిచెందాడు. సకాలంలో వైద్యం అందకనే తన కొడుకు మృతి చెందాడని తండ్రి వాపోయాడు.