KDP: సిద్దవటం మండలంలోని కొత్త మాధవరం 123 వార్డులో వెలసిన శ్రీ భక్త వీరాంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం,అలంకరణ,గణపతి పూజ, ఆకు పూజ, వడమాల పూజ, సహస్రనామార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
భక్త వీరాంజనేయుడికి ప్రత్యేక పూజలు


