CTR: రామకుప్పం (M) బందార్లపల్లి పంచాయతీ బగలనత్తం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడు పద్మనాభరెడ్డి మృతి చెందాడు. నిన్న రాత్రి పద్మనాభ రెడ్డి తన బంధువుని రామకుప్పంలో డ్రాప్ చేసి బైకుపై ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పద్మనాభ రెడ్డికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకుంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో నవ వరుడి మృతి


