హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారామపురంలో కుక్కల స్వైర విహారం

NLR: సీతారామపురంలో వీధి కుక్కల బెడదతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు.. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులను వెంటాడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.