హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు హెచ్‌ఐవీపై అవగాహన కార్యక్రమం

అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్సపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రిన్సిపాల్‌ రవి శంకర్‌ సూచించారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా అపోహలను తొలగించాలని ప్రజా చైతన్య సేవా సంఘం ప్రాజెక్ట్‌ మేనేజర్‌ స్వాతి కోరారు.