కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి మంగళవారం గోపాలపురం వాస్తవ్యులు సలాది రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు లక్ష విరాళం


