హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వలలకు చిక్కిన భారీ చేపలు

ASR: వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. డుడుమ జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జలవిద్యుత్‌ కేంద్రం దిగువన గిరిజనుల వలలకు భారీ చేపలు చిక్కుతున్నాయి. సోమవారం సింధిగుడ గ్రామానికి చెందిన పలువురికి భారీ చేపలు లభించాయి. ఒక్కో చేప సుమారు 20 కిలోల బరువుండగా.. కిలో రూ.150 చొప్పున విక్రయించారు.