PPM: జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు నాగావళి నదికి వరద పోటెత్తింది. దీంతో జియ్యమ్మవలస (M) బాసంగి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మోకాలు వరకు నీరు చేరింది. సమస్యను గ్రామస్థులు అధికారులకు తెలపడంతో ఎంఈవో1 ఎన్. విజయలక్ష్మి పరిశీలించి 10 మంది విద్యార్థులను వేరేచోటకు తరలించారు. పాఠశాలను వేరేచోటుకు మార్చాలని MEOకు గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల ఆవరణలో మోకాలు వరకు చేరిన నీరు


