హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెట్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్..!

MBNR: BRS హయాంలో వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఓ అథ్లెట్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఆ మాటలు విని తాను విస్తుపోయానని, తమ హయాంలో నిఖత్ జరీన్, ఈషా సింగ్ వంటి ఎంతోమంది క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించామని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే విపక్షాలు తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయిస్తున్నాయని మండిపడ్డాడు.