హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్ సెర్చ్‌.. భారీగా వాహనాలు సీజ్!

BPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో చీరాల రెండవ పట్టణ సీఐ శశికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు జాన్‌పేట, జయంతిపేటలలో ఫుట్‌మార్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టి, అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదని కౌన్సెలింగ్ ఇచ్చారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.