హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుబ్బయ్యపాలెం బీచ్‌ ప్రవేశంపై నిషేధం!

BPT: వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం వద్ద సముద్ర తీరం బీచ్ కోతకు గురైనందున పర్యాటకులు, సందర్శకులు ఎవరూ బీచ్‌కు వెళ్లరాదని చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ ప్రాంతంలోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించినట్లు స్పష్టం చేశారు. ఈ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించి పోలీసు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.