హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోమరోలులో నేడు పవర్ కట్

ప్రకాశం: కొమరోలు సబ్‌స్టేషన్ పరిధిలో RDSS పనుల నిమిత్తం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. తాతిరెడ్డిపల్లి, పురుషోత్తంపల్లి, సర్విరెడ్డిపల్లి, కె.బొంతపల్లి గ్రామాలతో పాటు కొమరోలులోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ విద్యుత్ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.