హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై అదుపు తప్పిన కారు

ప్రకాశం: సింగరాయకొండ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ లాండింగ్ మీద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా యధావిధిగా నడుస్తోంది.