శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో మంగళవారం సంస్కృత సాహిత్య మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు భాస్కరభట్ల శ్రీరామ శర్మ, లక్ష్మణరావు తెలిపారు. తెలుగు, సంస్కృత భాషల అభివృద్ధి, సంస్కృత సాహిత్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్కృత భాషాభిమానులు, సాహితీవేత్తలు, విద్యార్థులు పాల్గొనాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సంస్కృత సాహిత్య మహోత్సవం


