హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోపం vs పాపం

KNR: పుట్టుకతో పోలియో సోకిన 15 ఏళ్ల ప్రసాద్‌కు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వికలాంగత్వాన్ని సున్నా శాతంగా నమోదు చేశారు. ఏడాదిగా ఆసుపత్రి చుట్టూ తిరిగినా పరిష్కారం కాకపోవడంతో తండ్రితో కలిసి ప్రజావాణికి హాజరయ్యాడు. నిమ్స్ వైద్యులు దివ్యాంగుడిగా ధ్రువీకరించినా స్థానికంగా ధ్రువీకరణ అందడం లేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.