హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం

GNTR: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ అధ్యక్షతన నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.