హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ATP: గుత్తి-తాడిపత్రి ప్రధాన రహదారిపై చీమలవాగుపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆ కారు ముందున్న మరొక లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య ఇరుక్కుని కారు నుజ్జు నుజ్జు అయింది. అజయ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.