KDP: కొండాపురం మండలం దత్తాపురంలో న్యాయహక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ప్రతినిధి బాబా ఫకృద్దీన్ మాట్లాడుతూ.. సమస్యలు తలెత్తినప్పుడు రాజీ లేదా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమన్నారు. కార్యక్రమంలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఉమర్ ఫరూక్, సీఐ రాజ, ఎస్సై మంజునాథ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాజీ మార్గంతోనే సమస్యలకు పరిష్కారం'


