హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతాలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గవర వీధిలో వెలసిన శ్రీ గౌరీ పరమేశ్వరుని ఆలయంలో మంగళవారం ఉదయం మంగళ గౌరీ వ్రతాలు నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని వ్రతాలు ఆచరించడానికి మహిళా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్, ఫణి ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పెంటారావు, సత్తిబాబు పాల్గొన్నారు.