హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బొలెరో బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

KDP: కొండాపురం మండలం ముచ్చుమర్రి వద్ద సోమవారం రాత్రి బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అనంతపురం జిల్లా నుంచి ఒంగోలుకు బీరకాయల లోడుతో వెళ్తున్న వాహనం గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.