హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన గొలగమూడి మహోత్సవాలు

NLR: వెంకటాచలం మండలంలోని గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 44వ ఆరాధన మహోత్సవాలు సోమవారం రాత్రితో ఘనంగా ముగిసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈనెల 18న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆరాధన మహోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.