సత్యసాయి: హిందూపురం సత్యనారాయణపేటలోని ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 25న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం కొనసాగుతుంది. రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని రీజినల్ డైరెక్టర్ సుగంధదీది తెలిపారు. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురంలో నేడు రక్తదాన శిబిరం


