హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా రాయచోటిలో పల్లకి సేవ

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చక స్వాములు భక్తులకు అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ విషయాన్ని దేవస్థానం ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ తెలిపారు.