W.G: తణుకు మండలం పైడిపర్రు కొత్తకాలనీలో సోమవారం సాయంత్రం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. తణుకు రూరల్ CI వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు SI ఎన్. శ్రీనివాసరావు ప్రజలకు పలు సూచనలు చేశారు. దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పైడిపర్రులో పోలీసుల అవగాహన సదస్సు


