KRNL: పెద్దకడబురు మండల హోటళ్ల యజమానులు పేపర్ గ్లాసుల్లో టీ, కాఫీ వంటివి అందజేయకుండా స్టీల్, గాజు వాటిని మాత్రమే వినియోగించాలని డిప్యూటీ MPDO జయరాముడు సూచించారు. పేపర్ గ్లాసుల్లో వేడి పదార్థాలను ఉంచడం వల్ల దీర్ఘకాలిక క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడటం ఖాయమని ఏకంగా శాస్త్రవేత్తలే చెబుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు కూడా చైతన్య పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పేపర్ గ్లాసుల్లో టీ, కాఫీ వంటివి తాగకండి'


