హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ లోక్ అదాలత్‌కు సహకరించాలి: జడ్జి

WG: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా న్యాయవాదులు సహకరించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ. వాసంతి కోరారు. సోమవారం కోర్టు హాలులో బార్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యేలా న్యాయవాదులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.