హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే పాతరాయచోటిలో ఉరుసు

అన్నమయ్య: పాతరాయచోటిలో వెలసిన శ్రీ జమాలుల్లా బాబా ఉరుసు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25న గంధం ఊరేగింపు, 26న ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27న తహలీల్ ఫాతేహా కార్యక్రమం జరగనుంది. హిందూ, ముస్లిం సోదరులు పాల్గొని ఉరుసును విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా దర్గాలోని జమాలుల్లా బాబా సమాధిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.