హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనసైనికుడిని పరామర్శించిన మంత్రి దుర్గేష్

E.G: హార్ట్‌ స్ట్రోక్‌తో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిడదవోలు రూరల్‌ మండలం తాడిమళ్లకు చెందిన జనసైనికుడు తిరుమళ్ల కరుణాకర్‌ను మంత్రి కందుల దుర్గేష్‌ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి కరుణాకర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.