PDPL: విద్యా కార్యక్రమాల అమలులో రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మూడవ స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు సూచనలతో విద్యాశాఖలో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంథనిలో వెల్లడించారు. అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషితో జిల్లాకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
తెలంగాణ
విద్యా కార్యక్రమాలలో జిల్లాకు 3వ స్థానం: కలెక్టర్


