NDL: పాణ్యం పోలీస్ స్టేషన్‌ను సోమవారం జిల్లా ఎస్పీ సునీల్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన నేరుగా అక్కడ ఉన్న ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఉన్న రికార్డులను జిల్లా ఎస్పీ సునీల్ పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆయన పోలీసులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ


