హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక మోసాల దర్యాప్తుపై సీఐడీ అధికారులకు శిక్షణ

E.G: రాజమండ్రి సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి శాఖాపరమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యనార్ ఆదేశాలతో ఎస్పీ ఆర్. గంగాధరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. జీఎస్టీ నేరాలు, బ్యాంకింగ్ మోసాలు, డిజిటల్ ఆధారాల సేకరణ, ఏసీబీ, BNS, BNSS, BSA చట్టాలపై నిపుణులు అవగాహన కల్పించారు.