హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మెగా జాబ్ మేళా

కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సత్యబ్రహ్మం తెలిపారు.పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 18- 35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఉదయం 9 గంటలకు ఏపీఎస్ఎసీడీ‌సీ కార్యాలయంలో నిర్వహించే అర్హత పరిశీలన కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.