కృష్ణా: గుడివాడ రూరల్ మండలం టిడ్కో కాలనీలో పోలీసులు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై చంటి బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల మానవ జీవితాలు, కుటుంబాలు ఎలా నాశనమవుతాయో వివరించారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'


