హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం

ATP: జిల్లా ప్రజాపరిషత్తు చివరి సర్వసభ్య సమావేశం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు సీఈవో విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం వచ్చే నెల 24తో ముగియనుంది. జడ్పీ ఛైర్‌పర్సన్ బి.గిరిజమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులందరూ తప్పక హాజరు కావాలని ఆమె కోరారు.