హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో ఢీకొని ప్రాణాలు కోల్పోయిన క్రాంతికుమార్

వరంగల్ ఏసీరెడ్డినగర్‌కు చెందిన లొల్లాటి క్రాంతికుమార్ (30) రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఆదివారం ఆస్పత్రిలో ఉన్న తన తండ్రికి భోజనం ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చింతల్ ఆర్వోబీపై ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.