హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌తోనే బీసీలకు అసలైన గుర్తింపు: పొన్నాడ

కోనసీమ: బీసీలకు రాజకీయంగా అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ముమ్మిడివరం వైసీపీ ఇంచార్జ్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం 'వెన్నుపోటు పార్టీ నయవంచనపై బీసీల గర్జన' సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ కేబినెట్‌తో  పాటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించిందన్నారు.