హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు త్రాగునీటి సరఫరాకు అంతరాయం

VSP: టీఎస్ఆర్ రిజర్వాయర్ నుంచి వచ్చే పైపులైన్‌కు ముడసర్లోవ 350 ఎంఎం పంపింగ్ లైన్‌కు ఇంటర్ కనెక్షన్ పనులు చేపడుతున్నందున మంగళవారం ఆరిలోవ ప్రాంతానికి తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మంచినీటి సరఫరా ఈఈ సుధాకర్ తెలిపారు.12, 13 వార్డుల పరిధిలో నిలిపివేత ఉండగా బుధవారం యథావిధిగా సరఫరా ఉంటుందన్నారు. అత్యవసర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామన్నారు.