హైదరాబాద్: 28°C
క్రీడలు

హాకీ WC: సెమీస్ రేస్ నుంచి భారత్‌ ఔట్

హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు ప్రస్థానం ముగిసింది. సెమీఫైనల్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన చావో రేవో మ్యాచ్‌లో భారత్‌కు గట్టి షాక్ తగిలింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అర్జెంటీనా చేతిలో 5-3 గోల్స్ తేడాతో భారత్ పరాజయాన్ని చవిచూసింది. కాగా, మహిళల జట్టు కూడా ఇప్పటికే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.